BHEL Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL).. 575 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల (Graduate Apprentice posts)కు దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, అకౌంటెంట్, అసిస్టెంట్-HR, వెల్డర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే దరఖాస్తుదారల వయసు తప్పనిసరిగా ఆగస్టు 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఈ రోజు (సెప్టెంబర్ 7, 2022వ తేదీ) రాత్రి 11 గంటల 45 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.200లు చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.