BECIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో బీఈసీఐఎల్‌లో భారీగా ఉద్యోగావకాశాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

|

May 08, 2022 | 8:06 PM

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల (Data Entry Operator Posts) భర్తీకి..

BECIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో బీఈసీఐఎల్‌లో భారీగా ఉద్యోగావకాశాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Becil
Follow us on

BECIL Data Entry Operator Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల (Data Entry Operator Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 86

పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,184ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైపింగ్‌ స్పీడ్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ. 750
  • ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.450

దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSIR – CECRI Recruitment 2022: సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..