BDL Sangareddy Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గమనిక! సంగారెడ్డిలోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 119 ఉద్యోగాలు..

|

Nov 16, 2022 | 7:26 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోనున్న భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌.. 119 టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

BDL Sangareddy Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గమనిక! సంగారెడ్డిలోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 119 ఉద్యోగాలు..
BDL Sangareddy Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోనున్న భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌.. 119 టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, సీఎస్‌/ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.8,000ల నుంచి రూ.9,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.