Bank of Baroda Jobs 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం

Bank of Baroda Recruitment 2025 Notification to fill 58 Manager Posts: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్‌ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్యాంక్ ఆఫ్‌ బరోడా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

Bank of Baroda Jobs 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం
Bank Of Baroda Jobs

Updated on: Oct 05, 2025 | 6:30 AM

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్‌ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 58 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా అక్టోబర్‌ 9, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • చీఫ్‌ మేనేజర్‌(ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌) పోస్టుల సంఖ్య: 2
  • మేనేజర్‌ – (ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆపరేషన్స్‌) పోస్టుల సంఖ్య: 14
  • మేనేజర్‌ ఫారెక్స్‌ అక్విజిషన్‌ & రిలేషన్‌షిప్‌ పోస్టుల సంఖ్య: 37
  • సీనియర్‌ మేనేజర్‌ ఫారెస్ట్‌ అక్విజిషన్‌ & రిలేషన్‌షిప్‌ పోస్టుల సంఖ్య: 5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 24 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 9, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఎంఎంజీ/ఎంస్‌ – 2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు, ఎంఎంజీ/ఎస్‌-3 పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు, ఎస్‌ఎంజీ/ఎస్‌-4 పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.