Bank of Baroda Recruitment 2022: ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

|

Apr 12, 2022 | 6:06 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల (Agriculture Marketing Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

Bank of Baroda Recruitment 2022: ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
Follow us on

Bank of Baroda Agriculture Marketing Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల (Agriculture Marketing Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 26

పోస్టుల వివరాలు: అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RBI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్‌! రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..