Atomic Energy Central School: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.

|

Jul 05, 2021 | 8:09 PM

Atomic Energy Central School Recruitment: హైదరాబాద్‌లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌ పలు టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణు శక్తి విభాగానికి చెందిన ఈ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు...

Atomic Energy Central School: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.
Atomic Central School
Follow us on

Atomic Energy Central School Recruitment: హైదరాబాద్‌లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌ పలు టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణు శక్తి విభాగానికి చెందిన ఈ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో నోటఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో పీఆర్‌టీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పీఆర్‌టీ (తెలుగు) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్, బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణత సాధించాలి. పురుషుల వయసు 40 ఏళ్లు, మహిళల వయసు 50 ఏళ్లు మించకూడదు.
* టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈడీ/ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, డిగ్రీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత పొందాలి. పురుషులు 45 ఏళ్లు, మహిళలు 55 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* వివరాలను సెక్యూరిటీ కార్యాలయం, డీఏఈ కాలనీ, డీ-సెక్టార్‌ గేట్‌, కమలానగర్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 07-07-2021 కాగా, రాత పరీక్షను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధిపై రోజురోజుకీ పెరుగుతోన్న ఆసక్తి.. రూ. లక్ష కోట్లకు చేరుకున్న పెట్టుబడులు.

TSWREIS: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

CBSE Exams: సీబీఎస్‌ఈ 12 పరీక్షలు రాయానులకునే వారికి ముఖ్య గమనిక.. పరీక్షల నిర్వహణ ఎప్పటి నుంచంటే..