APVVP Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో 554 ఉద్యోగాలు నోటిఫికేషన్‌..రేపే ఆఖరు

|

Apr 11, 2022 | 3:44 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP).. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeon Posts) పోస్టుల భర్తీకి..

APVVP Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో 554 ఉద్యోగాలు నోటిఫికేషన్‌..రేపే ఆఖరు
Ap Jobs
Follow us on

APVVP Civil Assistant Surgeon Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP).. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeon Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 554

పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.53,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1500
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.1000

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Breaking: AP EAPCET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..