APVVP Prakasam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ప్రకాశం జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు..3 రోజుల్లో ముగుస్తున్న..

|

Mar 23, 2022 | 8:10 PM

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP) అధికారి కార్యాలయం.. ప్రకాశం జిల్లా (Prakasam District)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి..

APVVP Prakasam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ప్రకాశం జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు..3 రోజుల్లో ముగుస్తున్న..
Ap Jobs
Follow us on

APVVP Prakasam District Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP) అధికారి కార్యాలయం.. ప్రకాశం జిల్లా (Prakasam District)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

ఖాళీల వివరాలు:
రేడియోగ్రాఫర్: 2
ఫార్మసీ గ్రేడ్‌ 2: 2
ల్యాబ్‌ టెక్నీషియన్‌: 4
ఫిజియోథెరపిస్ట్‌: 1
ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌: 1
ఆఫీస్‌ సబార్డినేట్‌: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

ఓసీ అభ్యర్ధులకు: రూ. 300
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిస్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్సిటల్‌ సర్వీసెస్‌ (APVVP), ఒంగోల్‌, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC Civil Services 2021: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల..