APVVP Guntur Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) గుంటూరు జిల్లాలో ఔట్‌సోర్సింగ్, ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 4
ఖాళీల వివరాలు:
రేడియోగ్రాఫర్: 1
థియేటర్ అసిస్టెంట్: 2
ల్యాబ్ టెక్నీషియన్: 1
పే స్కేల్: నెలకు రూ.17,500ల నుంచి రూ.28,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డీసీహెచ్‌ఎస్, ఏపీవీవీపీ, గుంటూరు జిల్లా, ఏపీ.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: