APVVP East Godavari Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయం.. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్, బయో మెడికల్ ఇంజినీర్, ఆడియోమెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, డెంటల్ టెక్నీషియన్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వయోపరిమితి: మార్చి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), New Collectorate, East Godavari District, AP.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300
వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: