APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..

|

Mar 02, 2021 | 6:51 PM

APSSDC Job Opportunities : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)శుభవార్త తెలిపింది. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంలో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ

APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..
Follow us on

APSSDC Job Opportunities : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)శుభవార్త తెలిపింది. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంలో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని వినియోగించాలని యువతను కోరింది. రిక్రూట్ మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన విజయనగరం జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మార్చి 3 ఉదయం 9 గంటలకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మొదలవుతుంది. అంతకన్నా ముందే అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలు ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. కాకపోతే ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో చూడొచ్చు.

ముఖ్య వివరాలు:
1.విద్యార్హతలు: ఈ పోస్టులకు బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చదివినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.
2.వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
3.ఇంటర్వ్యూలు జరిగే వేదిక: ప్రగతి డిగ్రీ కాలేజ్, కొత్తవలస, కుమ్మరివీధి, కే.కోటపాడు రోడ్, కొత్తవలస గ్రామం, మండలం, విజయనగరం జిల్లా.
4.జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.16,000 మధ్య వేతనం ఉంటుంది.
5. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌:https://www.apssdc.in/ సంప్రదించవచ్చు.

టాటా సన్ చైర్మన్ టాక్…. కరోనా తర్వాత పెరిగిన అవకాశాలు… అందిపుచ్చుకోవడమే తరువాయి….

Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..

Snake Bite : జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నాగుపాము.. పడగ విప్పుతూ పరేషాన్.. వాహనాల రాకపోకలకు అంతరాయం..