APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ ప్లాన్‌ ఇదే!

ఏపీపీఎస్సీ 166 ఖాళీలతో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబరు 26, 2026వ తేదీతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియనుంది. జనవరి 24న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు మూడున్నర నెలల..

APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ ప్లాన్‌ ఇదే!
APPSC Group 1 Selection Process

Updated on: Oct 08, 2026 | 6:08 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) 166 ఖాళీలతో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబరు 26, 2026వ తేదీతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియనుంది. జనవరి 24న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు మూడున్నర నెలల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. గ్రూప్‌ 1 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ముందుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆ తర్వాత మెయిన్స్‌, చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్‌, మార్కులు, నెగెటివ్‌ మార్కింగ్‌తో పాటు మూడున్నర నెలల్లో ప్రిపరేషన్‌ ఎలా కొనసాగించాలో తెలుసుకుందాం.

మూడు దశల్లో గ్రూప్‌ 1 ఎంపిక

APPSC గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

  • స్క్రీనింగ్‌ టెస్ట్‌ – ఆబ్జెక్టివ్‌ టైప్‌
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ – డిస్క్రిప్టివ్‌ టైప్‌
  • ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌

స్క్రీనింగ్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..?

స్క్రీనింగ్‌ పరీక్ష OMR ఆధారిత ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌కు 120 మార్కులకు 120 ప్రశ్నలకు 120 నిమిషాల్లో పరీక్ష ఉంటుంది. పేపర్‌ 2లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 120 మార్కులకు 120 ప్రశ్నలకు 120 నిమిషాలపాటు పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో రెండు పేపర్లకు హాజరు కావడం తప్పనిసరి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు. కాబట్టి సమాధానాల్లో ఖచ్చితత్వం చాలా కీలకం.

ఇవి కూడా చదవండి

మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుందంటే..?

స్క్రీనింగ్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి.

  • తెలుగు (క్వాలిఫైయింగ్‌ పేపర్‌) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • ఇంగ్లిష్‌ (క్వాలిఫైయింగ్‌ పేపర్‌) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • పేపర్‌-I (జనరల్‌ ఎస్సే) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • పేపర్‌-II (హిస్టరీ, కల్చర్‌ & జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • పేపర్‌-III (కాన్స్టిట్యూషన్‌, గవర్నెన్స్‌, లా, ఎథిక్స్‌) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • పేపర్‌-IV (ఎకానమీ & డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు
  • పేపర్‌-V (సైన్స్‌, టెక్నాలజీ & ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌) పేపర్‌లో 150 మార్కులకు 180 నిమిషాలు

పేపర్‌-I నుంచి పేపర్‌-V వరకు 750 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 75 మార్కులు ఉంటాయి. అంటే మెరిట్‌ కోసం మొత్తం 825 మార్కులు పరిగణనలోకి వస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌ పేపర్లు కేవలం క్వాలిఫైయింగ్‌ పేపర్లు మాత్రమే. వాటిలో సాధించిన మార్కులను మెరిట్‌లో కలపరు. కనీస అర్హత మార్కులు OC/స్పోర్ట్స్‌ పర్సన్స్‌/EWS అభ్యర్ధులకు 40%, BC అభ్యర్ధులకు 35%, SC/ST/దివ్యాంగ అభ్యర్ధులకు 30% చొప్పున నిర్ణయించారు. తెలుగు, ఇంగ్లిష్‌ పేపర్లు మినహా మిగిలిన పేపర్లను తెలుగు, ఇంగ్లిష్‌ లేదా ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు. అభ్యర్థి ఎంచుకున్న మాధ్యమాన్ని సంబంధిత పేపర్లలో కొనసాగించాలి.

ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌

మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు పిలుస్తారు. సాధారణంగా ఖాళీల సంఖ్యకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

మూడున్నర నెలల్లో ప్రిపరేషన్‌ ఎలా?

జనవరి 24న స్క్రీనింగ్‌ పరీక్ష జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులకు దాదాపు మూడున్నర నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని దశలవారీగా విభజించుకుని చదివితే సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు రివిజన్‌, మాక్‌ టెస్టులకు కూడా తగిన సమయం కేటాయించవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 వంటి పోటీ పరీక్షలో ఎక్కువ గంటలు చదవడం కంటే సరైన ప్రణాళికతో చదవడం, పునశ్చరణ చేయడం, MCQs సాధన చేయడం, మాక్‌ టెస్టుల్లో తప్పులను విశ్లేషించడం చాలా ముఖ్యం. జనవరి 24 వరకు ఉన్న సమయాన్ని దశలవారీగా వినియోగించుకుంటే స్క్రీనింగ్‌ పరీక్షకు మంచి స్థాయిలో సన్నద్ధం కావచ్చు. అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, ప్రీవియస్‌ పేపర్లను విశ్లేషించి, రోజువారీ చదువు–రివిజన్‌–MCQs అనే మూడు అంశాలను తమ ప్రిపరేషన్‌లో భాగం చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us