AP New academic year Delayed 2022-23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు మే రెండోవారం వరకు కొనసాగే అవకాశముంది. సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ చివరివారంలో ఉంటాయి. ప్రశ్నపత్రాల మూల్యాంకనం, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, విద్యార్థులను పై తరగతులకు పంపడం పూర్తిచేయాలి. ఇదంతా సకాలంలో జరిగే అవకాశం లేదు. మరోవైపు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9వరకు జరగనున్నాయి. దీంతో 2022-23 విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా జులై 4న ప్రారంభం కానుంది.
ఇంటర్‌కు 28 నుంచి సెలవులు
జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 28 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ యోచిస్తోంది. మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. తర్వాత ఒకట్రెండు రోజులు సెలవులిచ్చి, మే 26 నుంచి మళ్లీ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
Also Read: