AP Police Constable Hall Tickets 2023: ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు హాల్‌టికెట్లను గురువారం (జనవరి 12) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

AP Police Constable Hall Tickets 2023: ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
Ap Police Constable Hall Tickets

Updated on: Jan 12, 2023 | 1:15 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు హాల్‌టికెట్లను గురువారం (జనవరి 12) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీ సర్కార్‌ విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు గానూ దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు. వీరంతా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించింది.

కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200ల మార్కులకు 3 గంటల వ్యవధిలో ఉంటుంది. ఇక ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.