ఏపీ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు.. అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు

రాష్ట్ర హైకోర్టు 2026లో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి ఎల్‌డీసీఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఏపీ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు.. అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు
AP High Court Recruitment

Updated on: Sep 21, 2026 | 2:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ సర్వీస్‌లోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కేడర్ అధికారుల నుంచి లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఓపెన్ కేటగిరీలో గ్రూప్ 1, 2, 3 సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16 సివిల్‌ జడ్జి (సీనియర్ డివిజన్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 1, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఏపీ హైకోర్టు సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా పనిచేస్తుండాలి. మార్చి 31, 2026 నాటికి కనీసం మూడు (3) సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. లా డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాల అటెస్టెడ్ కాపీలను కూడా దరఖాస్తుతోపాటు సమర్పించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో
ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 1, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌/ బీసీ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, అనుభవ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నెలకు రూ. 1,11,000 నుంచి రూ. 1,63,030 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం

ఆన్‌లైన్ రాత పరీక్ష MCQ విధనంలో ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 3 పేపర్లకు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు, 3 గంటల సమయంలో నిర్వహిస్తారు. అనంతరం మౌఖిక పరీక్ష ఉంటుంది.

చిరునామా

Registrar (Recruitment),
High Court of Andhra Pradesh,
Nelapadu, Amaravati.

ఏపీ హైకోర్టు సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us