AP GPCET 2022 Results: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం (మే 4) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘5వ తరగతిలో 14,940 సీట్లకు, ఇంటర్‌లో 13,560 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://apgpcet.apcfss.in/లో అందుబాటులో ఉంచాం. వసతికి అవకాశం ఉంటే మరిన్ని సీట్లు పెంచుతాం. డిమాండ్ ఉన్న కోర్సుల్లోనూ సీట్లు పెంచుతాం. ఉపాధి కల్పన కోర్సులను ప్రవేశపెడతాం. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా పాకెట్‌మనీని పెంచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో జూనియర్ ఇంటర్‌లో విశాఖ జిల్లాకు చెందిన నాగమోహనకృష్ణ మొదటి ర్యాంకు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన షేక్ ఆల్‌మొమెన్ అమన్ రెండో ర్యాంకు, అన్నమయ్య జిల్లాకు చెందిన బి.గురుప్రసాద్ మూడో ర్యాంకు, 5 తరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు చెందిన కొరివిపాటి నాజర్ వలీ మొదటి ర్యాంకు, వెన్న ప్రసన్నలక్ష్మి రెండో ర్యాంకు, బట్టు రాఘవ మూడో ర్యాంకు సాధించారు.
Also Read: