AP EMRS Admissions 2022: ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..

|

May 07, 2022 | 9:35 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోనున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు..

AP EMRS Admissions 2022: ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..
schools merging
Follow us on

AP Ekalavya Model Residential school admission notification 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోనున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్‌ సీట్లను నింపడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆరో తరతగతిలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి.

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా 2021-22 విద్యాసంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6,7,8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: మార్చి 31, 2022 నాటికి 10 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 7,8,9 తరగతులకు 200 మార్కులకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 17, 2022.

పరీక్ష తేదీ: మే 21, 2022.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIIMS Bibinagar Recruitment 2022: తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.67700ల జీతం..