AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. మే 13 నుంచి పరీక్షలు

|

Mar 13, 2024 | 3:23 PM

జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌)-2024 నోటిఫికేషన్‌ మార్చి 11 (సోమవారం) విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు మంగళవారం (మార్చి 12) నుంచి ప్రారంభమైనట్లు సెట్‌ ఛైర్మన్‌, ఉప కులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ డీఏపీ కె.వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు..

AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. మే 13 నుంచి పరీక్షలు
AP EAPCET 2024
Follow us on

కాకినాడ, మార్చి 13: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌)-2024 నోటిఫికేషన్‌ మార్చి 11 (సోమవారం) విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు మంగళవారం (మార్చి 12) నుంచి ప్రారంభమైనట్లు సెట్‌ ఛైర్మన్‌, ఉప కులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ డీఏపీ కె.వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దరఖాస్తు సమయంలో ఓసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1200, బీసీ కేగగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఇక మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. మే 17 నుంచి 19 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు చెందిన పరీక్షలు జరుగుతాయి. ఏపీఈఏపీసెట్‌ – 2024 పరీక్ష కేంద్రాలను తెలంగాణలో సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌లలోనూ ఏర్పాటు చేసినట్లు సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా 0884-2359599, 2342499 నంబర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు.

తెలంగాణ ‘ఆదర్శ’ పాఠశాలల్లో ప్రవేశాలకు 65,140 దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు 65,140 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆరో తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 35,436 మంది విద్యార్ధులు పోటీ పడుతున్నారు. ఏడో తరగతికి 10,177 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.