AP govt jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేల జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని జిల్లా కోర్టుల్లో.. 158 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP govt jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.80 వేల జీతం..
AP District Courts Recruitment 2022

Updated on: Oct 28, 2022 | 8:27 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని జిల్లా కోర్టుల్లో.. 158 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.400లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,220ల నుంచి రూ.80,910ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురం ఖాళీలు: 11
  • చిత్తూరు ఖాళీలు: 19
  • తూర్పు గోదావరి ఖాళీలు: 21
  • గుంటూరు ఖాళీలు: 25
  • వైఎస్ఆర్ కడప ఖాళీలు: 14
  • కృష్ణా ఖాళీలు: 15
  • కర్నూలు ఖాళీలు: 9
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 5
  • ప్రకాశం ఖాళీలు: 11
  • శ్రీకాకుళం ఖాళీలు: 10
  • విశాఖపట్నం ఖాళీలు: 6
  • విజయనగరం ఖాళీలు: 5
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 7

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us