
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ – 2023 పబ్లిక్ పరీక్షల టైం టేబుల్‌ను ఏపీ ఇంటర్ బోర్డు సోమవారం (డిసెంబర్ 26) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిరోజూ పరీక్షలు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్స్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 24న జరుగుతుంది. ఇక ప్రాక్టికల్స్ ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు రెండు సెషన్లలో ఉంటాయి. ఈ మేరకు పరీక్షల తేదీలను తెలియజేస్తూ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
Ap Intermediate Public Examination March 2023 Schedule
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.