AP ICET 2025 Hall Tickets: ఏపీ ఐసెట్‌ రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. హాల్‌ టికెట్‌ లింక్ ఇదే!

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఆధ్వర్యంలో మే 7న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ సెట్‌ కన్వీనర్‌ ఎం శశి తెలిపారు. పరీక్ష రోజు ఉదయం, సాయంత్రం సెషన్లలో రెండు షిఫ్టులుగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది..

AP ICET 2025 Hall Tickets: ఏపీ ఐసెట్‌ రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. హాల్‌ టికెట్‌ లింక్ ఇదే!
AP ICET 2025 Exam

Updated on: May 04, 2025 | 1:54 PM

అమరావతి, మే 4: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఆధ్వర్యంలో మే 7న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ సెట్‌ కన్వీనర్‌ ఎం శశి తెలిపారు. పరీక్ష రోజు ఉదయం, సాయంత్రం సెషన్లలో రెండు షిఫ్టులుగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఆరోజు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో షిఫ్ట్‌ పరీక్ష ఉంటుందని ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37,572 మంది విద్యార్ధులు ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశామని, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు.

ఏపీ ఐసెట్‌ హాల్‌టికెట్ల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ ఐసెట్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

తెలంగాణ ఐసెట్‌ 2025 పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అల్వాల రవి శనివారం (మే 4) ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తొలుత ప్రకటించిన గడువు మే 3(శనివారం)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని, మళ్లీ గడువును ఈ మేరకు పెంచారు. జూన్‌ 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us