AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,05,500 జీతం

రాష్ట్ర వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డీఎంఈల పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 220 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ.

AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,05,500 జీతం
Andhra Pradesh Assistant Professor Recruitment

Updated on: Jan 07, 2026 | 4:15 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డీఎంఈల పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 220 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు గురువారం (జనవరి 8, 2026) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని బోర్డు పేర్కొంది.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్) పోస్టుల సంఖ్య: 130
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్-క్లినికల్) పోస్టుల సంఖ్య: 16
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) పోస్టుల సంఖ్య: 74

ఈ పోస్టులను జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్ధులు తప్పనిసరిగా ఎండీ లేదా ఎంఎస్‌ లేదా డీఎన్‌బీ లేదా డీఎం లేదా ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణత పొందాలి. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వమోపరిమితి జులై 1, 025 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్, అభ్యర్థులకు ఐదేళ్లు, పీడౠ్ల్యబీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఈ కింది ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్, పీడౠ్ల్యబీ అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us