ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవు ప్రకటించిన సర్కార్!

మహర్నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 19, 2026న సాధారణ సెలవు ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14 రెండో శనివారాన్ని పని దినంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మాత్రం యథావిధిగా తమ విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవు ప్రకటించిన సర్కార్!
Maharnavami Holiday On October 19

Updated on: Oct 17, 2026 | 6:38 AM

అమరావతి, అక్టోబర్ 17: మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 19న సాధారణ సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14, రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని స్పష్టం చేసింది. 2026 అక్టోబర్ 19వ తేదీ సోమవారం మహర్నవమి సందర్భంగా సాధారణ సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ విభాగం) జీఓ ఆర్టీ నంబర్ 2015ను అక్టోబర్ 16న విడుదల చేసింది.

ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రకటించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాలో అక్టోబర్ 19కు సెలవు లేదు. అయితే, ఏపీ సచివాలయ సంఘం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం మహర్నవమి సందర్భంగా ఆ రోజును సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14, రెండో శనివారం పని దినంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మినహాయింపు లేదు

ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది మాత్రం యథావిధిగా తమకు కేటాయించిన విధులకు హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలోని సంబంధిత ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us