AEES Teaching and Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న అటమిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES).. దేశవ్యాప్తంగా ఉన్న 30 అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్/ జూనియర్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల (Teacheing and Non Teaching Post) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 205
పోస్టుల వివరాలు:
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ.
సబ్జెక్టులు: ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ/ సంస్కృతం, మ్యాథ్స్/ ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ, కంప్యూటర్ సైన్స్, పీఈటీ (మేల్), పీఈటీ (ఫిమేల్), ఆర్ట్, మరాఠీ.
వయోపరిమితి: జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.