5G Network Impact On Jobs: కరోనా ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. దీంతో దేశం ఆర్థికంగా మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. సహజంగానే ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టెలికం రంగంలో మాత్రం ఉద్యోగాల నియామకం ఆశాజనకంగా ఉండడం విశేషం. మరీ ముఖ్యంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తుండడంతో ఉద్యోగాల నియామకం పెరగనున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
దేశంలోకి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న 5జీ సేవలతో రానున్నరెండేళ్లలో ఒప్పంద ఉద్యోగుల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. 5జీ రంగం అభివృద్ధితో టెక్నీషియన్స్ నుంచి ఇన్‌స్టలేషన్ ఇంజినీర్స్ ఉద్యోగాలతో పాటు.. సివిల్ ఇంజనీర్లు, ప్రాజెక్టు మేనేజర్ల వంటి ఉద్యోగాలు భారీ ఎత్తున పెరగనున్నట్లు నివేదికలో వెల్లడైంది. 5జీ సేవలు భారత్‌లో కొత్తగా రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈ రంగంలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది రిక్రూట్ మెంట్ 18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2019తో పోలిస్తే 2020లో టెలికం రంగంలో 50 శాతం అదనంగా నియామకాలు చేపట్టినట్లు టీమ్‌లీజ్ వెల్లడించింది.
Covid 19 Death Audit Report: ఏపీలో కరోనా మరణాలపై డెత్ ఆడిట్.. వెలుగులోకి సంచలన విషయాలు..