మొహం చూసి జబ్బును కనిపెట్టొచ్చు..!

కొందరు నడతను బట్టి, మాట తీరును బట్టి మనిషి అనారోగ్యాన్ని పసిగడతారు. ఎందుకలా వున్నావ్ అని ఆరా తీస్తారు. కానీ.. చెయ్యి లాక్కుని నాడి పట్టుకుని గానీ ఏమీ చెప్పలేని డాక్టర్లూ వుంటారు. మీ బంధువో, మీ స్నేహితుడో, మీ సహచరుడో సుస్తీకి గురైతే.. అతడి మొహంలోకి చూసి అతడికేమైందో ఇట్టే తెలుసుకోవచ్చు.. అన్నది తాజా వార్త. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్‌కా యూనివర్సిటీ రీసెర్చర్లు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

ఒక హెల్త్ వాలంటీర్‌కి.. మొదటగా ఈ-కోలి లేదా placebo.. ఈ రెండింటిలో ఏదో ఒక వైరస్‌ని ఇంజెక్ట్ చేసి.. ముందటి ఫోటోను, రెండు గంటల తర్వాతి ఫోటోను కలిపి మిగతా వాళ్లకు చూపెట్టారు. ‘ఇన్ఫెక్షన్’ సోకిన పేషేంట్‌ని వెంటనే సులభంగా గుర్తు పట్టేశారు. పాలిపోయిన పెదాలు, వాలిపోతున్న కనురెప్పలు, వాడిపోయిన ముఖ కవళికలు.. ఇలా మొహం చూసి రోగి లక్షణాల్ని వెంటనే కనిపెట్టేశారు. ఇన్ఫెక్షన్‌కీ, శరీరంలోని ఇమ్యూన్ సిస్టంకి మధ్య జరిగే పోరాటంతో ముఖంలో స్పష్టమైన తేడాలొచ్చేస్తాయన్నది పరిశోధకుల మాట. సో.. ‘నాకేమీ లేదు.. నేను బాగానే వున్నా’నంటూ బుకాయించేవాళ్ళకు ఆ ఛాన్స్ లేనట్లేగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *