చిరంజీవి వాడిన తొలి కెమెరా మీరు చూశారా..?

మెగస్టార్‌ చిరంజీవి వాడిన తొలి కెమెరా మీరు చూశారా..? ఆ కెమెరాతో తీసిన ఫోటో ఏంటో తెలుసా..? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరా.? ఇక్కడ కనిపిస్తున్న ఈ కెమెరానే మొదటిసారి మెగస్టార్‌ చిరు వాడారు.

చిరంజీవి వాడిన తొలి కెమెరా మీరు చూశారా..?
Follow us

|

Updated on: Aug 19, 2020 | 7:54 PM

First Camera used by Megastar : మెగస్టార్‌ చిరంజీవి వాడిన తొలి కెమెరా మీరు చూశారా..? ఆ కెమెరాతో తీసిన ఫోటో ఏంటో తెలుసా..? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరా.? ఇక్కడ కనిపిస్తున్న ఈ కెమెరానే మొదటిసారి మెగస్టార్‌ చిరు వాడారు.

అలనాటి ఆగ్ఫా కెమెరాను వాడిన చిరంజీవి…. అదే కెమెరాతో తొలి ఫోటో కూడా తీశారు. ఇందులో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా అంటూ పజిల్‌ కూడా ఇచ్చేశారు మెగస్టార్ చిరంజీవి.

ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చారు చిరూ. తాను వాడిన మెదటి కెమెరా…తాను తీసిన మొదటి ఫోటోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుశారు మెగాస్టార్‌ చిరు. మొదటి ఫోటో తీసింది ఇటువంటి కెమేరాతోనే అంటూ.. అలనాటి ఆగ్ఫా కెమెరాను పోస్ట్ చేశారు.

కాసేపటి తర్వాత.. ఆ ఫోటోను కూడా షేర్ చేశారు. ఐదుగురు చిన్న పిల్లలున్న ఈ ఫోటోలో మీకు బాగా తెలిసిన వ్యక్తి ఉన్నారంటూ పజిల్‌ కూడా ఇచ్చారు. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కచ్చితంగా పవణ్‌ కళ్యాణ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అందులో ఉన్నది ఎవరూ అని మాత్రం తన ఫ్యాన్స్ కు వదిలి పెట్టారు మెగా స్టార్.