పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకె..

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. వచ్ఛే వారం చట్ట సభ ఈ బిల్లును చేపట్టవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్ఛే ముస్లిమేతర శరణార్ధులకందరికీ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ బిల్లును ఉద్దేశించారు. తమ దేశాల్లో మత సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారికి ఈ దేశంలో ఇక పౌరసత్వం లభిస్తుందన్న మాట. పాక్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ దేశాలు ఇస్లామిక్ దేశాలు గనుక ఆ యాదేశాల్లోని […]

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకె..
Follow us

|

Updated on: Dec 04, 2019 | 2:51 PM

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. వచ్ఛే వారం చట్ట సభ ఈ బిల్లును చేపట్టవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్ఛే ముస్లిమేతర శరణార్ధులకందరికీ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ బిల్లును ఉద్దేశించారు. తమ దేశాల్లో మత సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారికి ఈ దేశంలో ఇక పౌరసత్వం లభిస్తుందన్న మాట. పాక్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ దేశాలు ఇస్లామిక్ దేశాలు గనుక ఆ యాదేశాల్లోని నాన్-ముస్లిములు మత సంబంధమైన చిక్కులను ఎదుర్కొని ఈ దేశానికి శరణార్థులుగా చేరుకున్న పక్షంలో వారికి భారత పౌరసత్వం లభిస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. తమ పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదానికి పంపుతున్నట్టు తెలిపారు. అయితే ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తానని, ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని కాంగ్రెస్ నేత శశిథరూర్ అప్పుడే బాంబు పేల్చారు. తనమాదిరే పలువురు తమ పార్టీ నాయకులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.