Yamaha E10 Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకునేందుకు ఆయా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈవీ రంగంలో ఆయా కంపెనీలు పోటీ పడి వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇక ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్స్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. యమహా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా E01 పరీక్షలను సైతం మొదలు పెట్టింది. థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా E01 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ స్కూటర్ అన్ని విధాలుగా తట్టుకునేలా రూపొందించింది కంపెనీ. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్‌కు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. సీటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించింది.
యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.9 kwh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ సహాయంతో 5000ఆర్‌ఎంపీ వద్ద 8.1kw, 1,950 ఆర్‌పీఎం వద్ద 30.2ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ సుమారు 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు పవర్ మోడ్‌లతో పాటు రివర్న్ మోడ్‌లో వస్తుంది. ఈ స్కూటర్‌లో మూడు రకాల ఛార్జింగ్‌లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: