Xiaomi: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ.. ప్రపంచంలోనే రెండో స్థానం

Xiaomi: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ సంచలనం సృష్టించింది. యాపిల్‌ కంపెనీని సైతం వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ల తయారీ సంస్థగా నిలిచింది. ఇక మరో.

Xiaomi: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ.. ప్రపంచంలోనే రెండో స్థానం
Xiaomi
Follow us

|

Updated on: Jul 16, 2021 | 12:49 PM

Xiaomi: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ సంచలనం సృష్టించింది. యాపిల్‌ కంపెనీని సైతం వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ల తయారీ సంస్థగా నిలిచింది. ఇక మరో మొబైల్‌ సంస్థ శాంసంగ్‌ అగ్రస్థానంలో ఉంది. టెక్నాలజీ మార్కెట్‌ అనలిస్ట్‌ నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 19 శాతం షేర్‌లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ టాప్‌ పొజిషన్‌లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటి వరకు శాంసంగ్‌, యాపిల్‌ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటూ వచ్చేది. కానీ మొదటి సారి షియోమీ రెండో స్థానానికి చేరుకుని సంచలనం సృష్టించింది.

హువాయ్‌ పతనం తర్వాత ఫోన్‌ కంపెనీల పోటీ..

కాగా, హువాయ్‌ పతనం తర్వాత మిగతా ఫోన్‌ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ స్థానాన్ని పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్‌ దేశాలకు 300 శాతంకుపైగా, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్‌ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్‌ ఎగుమతులు అయ్యాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్‌ మరింతగా పెరిగిందని, అదే సమయంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్‌ నివేదిక వెల్లడించింది. అయినా.. షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగినట్లయితే షియోమీ నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడంలో ఎలాంటి సందేహం లేదని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్‌ ఉండగా, ఒ‍ప్పో, వివోలు పదిశాతం చొప్పున మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

Ola Electric Scooter: గుడ్‌న్యూస్‌.. కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.499తో బుక్ చేసుకోండిలా!

Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ

Maruti Suzuki: కార్ల కంపెనీ మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.18 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌

Latest Articles
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు
నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా రాజీనామా..!
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా రాజీనామా..!
మీకు పోలీసులు లేదా అధికారుల నుండి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయా?
మీకు పోలీసులు లేదా అధికారుల నుండి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయా?
శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు..
శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు..