Wonderla: వండర్‌లా అదిరిపోయే ఆఫర్స్.. విద్యార్థులకు భారీ డిస్కౌంట్.. బై 2 గెట్ 1 ఫ్రీ..!

Hyderabad Wonderla Summer Offers: వేసవిలో వండర్‌లా హైదరాబాద్ వెళ్లాలనుకునే వారికి ముందుగానే గుడ్‌న్యూస్‌. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. విద్యార్థులకు ఇక్కడ ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. అలాగే మదర్స్‌డే, పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆఫర్లను ప్రకటించింది వండర్‌లా. అంతేకాదు.. టికెట్ పైనే కాకుండా ఫుడ్ పైనా డిస్కౌంట్స్ పొందవచ్చు..

Wonderla: వండర్‌లా అదిరిపోయే ఆఫర్స్.. విద్యార్థులకు భారీ డిస్కౌంట్.. బై 2 గెట్ 1 ఫ్రీ..!
Hyderabad Wonderla

Updated on: May 01, 2026 | 9:22 AM

Hyderabad Wonderla Summer Offers: వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌లోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ ‘వండర్‌లా’ సందర్శకులను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. విద్యార్థుల నుంచి మాతృమూర్తుల వరకు అందరికీ వర్తించేలా ఈ రాయితీలు ఉన్నాయి.

విద్యార్థుల కోసం ప్రత్యేక హాల్ టికెట్ ఆఫర్:

ఇటీవల పది, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వండర్‌లా బంపర్ ఆఫర్ ఇస్తోంది. తమ హాల్ టికెట్ చూపిస్తే టికెట్ ధరపై ఏకంగా 35 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, 24 ఏళ్ల లోపు వయస్సు ఉండి, కాలేజీ ఐడీ కార్డు కలిగిన విద్యార్థులకు టికెట్లు, ఫుడ్ పైన 20 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

ఇవి కూడా చదవండి

వేసవి ప్రత్యేక తగ్గింపులు (జూన్ 30 వరకు):

  • ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సాధారణ సందర్శకులు కూడా 30 శాతం రాయితీని పొందవచ్చు.
  • పెద్దలకు టికెట్: రూ.1,346.61 (GST అదనం)
  • పిల్లలకు టికెట్: రూ.1,188.14 (GST అదనం)
  • కాంబో: అడల్ట్ టికెట్ + బఫే రూ.1,816.71 కి లభిస్తుంది.

మదర్స్ డే, బర్త్‌డే స్పెషల్:

  • మదర్స్ డే (మే 9, 10): తల్లితో కలిసి వచ్చే వారు రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఉచితంగా లభిస్తుంది (Buy 2 Get 1 Free).
  • పుట్టినరోజు ఆఫర్: మీ పుట్టినరోజున వండర్‌లాను సందర్శిస్తే ‘బై 1 గెట్ 1’ ఆఫర్ కింద ఒక టికెట్‌పై మరొకటి ఉచితంగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: SBI Credit Card Rule: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌.. మే 1 నుంచి అమల్లోకి..

యాన్యువల్ పాస్, ఈవెనింగ్ ఆఫర్:

వండర్‌లాలో ఏడాది పొడవునా ఎంజాయ్ చేయాలనుకునే వారు రూ.3,388 తో యాన్యువల్ పాస్ తీసుకోవచ్చు. ఇందులో 4 ఎంట్రీలు ఉచితంగా లభిస్తాయి. ఇక మధ్యాహ్నం ఎండను తట్టుకోలేము అనుకునే వారి కోసం సాయంత్రం వేళల్లో 40 శాతం రాయితీతో ఈవెనింగ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక ముఖ్య విషయం ఏంటంటే.. రద్దీని తట్టుకోవడానికి ఆన్‌లైన్ బుకింగ్ ఉత్తమం. అలాగే వాటర్ రైడ్స్ కోసం నైలాన్ దుస్తులు తప్పనిసరి ఉండాల్సిందే.  వీకెండ్స్‌లో వెయిటింగ్ టైమ్ తగ్గించుకోవడానికి ‘ఫాస్ట్‌ట్రాక్’ టికెట్లను పరిశీలించండి.

ఇది కూడా చదవండి: LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us