Financial Year: ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చి 31తో ఎందుకు ముగుస్తుంది? కారణాలు ఇవే!

|

Mar 29, 2024 | 5:08 PM

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈసారి FY 2023-24 క్లోజ్‌ అవుతుంది. ఈ కాలంలో పన్ను చెల్లింపుదారులు ఆ కాలంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తారు. వారి ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే వారు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది..

Financial Year: ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చి 31తో ఎందుకు ముగుస్తుంది? కారణాలు ఇవే!
Financial Year
Follow us on

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈసారి FY 2023-24 క్లోజ్‌ అవుతుంది. ఈ కాలంలో పన్ను చెల్లింపుదారులు ఆ కాలంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తారు. వారి ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే వారు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్యం రాకముందే ఇది జరిగింది. కాలానుగుణంగా పన్ను శ్లాబు మాత్రమే మారుతోంది.

ఇప్పుడు రూ. 3 లక్షల వరకు సంపాదన పన్ను రహితంగా ఉంది. కానీ ఆర్థిక చక్రం నేటికీ అలాగే ఉంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు రెండు పన్ను విధానాలు ఉన్నాయి. ఒకటి పాత పన్ను విధానం, రెండోది కొత్త పన్ను విధానం. పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వరకు ఆదాయం పన్ను పరిధికి వెలుపల ఉండేది. కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఆదాయాలు పన్ను నెట్‌కు దూరంగా ఉన్నాయి. ఇది పన్నుకు సంబంధించిన ప్రాథమిక అంశం. ఆర్థిక సంవత్సరం నెలల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వెనుక కారణాన్ని ఇప్పుడు చూద్దాం.

దీని వెనుక ఉన్న కారణాలేంటి?

ఇవి కూడా చదవండి

1. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలనే నియమం బ్రిటిష్ కాలం నుంచి అనుసరిస్తోంది. ఎందుకంటే అది వారికి సౌకర్యంగా ఉండటం కారణంగా ఇప్పటికే ఇలాగే కొనసాగుతోందని తెలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజ్యాంగంలో కూడా ఆర్థిక సంవత్సరం సమయాన్ని మార్చి-ఏప్రిల్‌గా మాత్రమే ఉంది.

2. భారతదేశం వ్యవసాయాధారిత దేశం. అందుకే పంటల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ సమయంలో కొత్త పంట వేస్తారు. రైతులు పాత పంటను పండించి మార్కెట్‌లో విక్రయించడం వల్ల వారికి కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో తదనుగుణంగా వారి లావాదేవీల ఖాతాలను సిద్ధం చేస్తారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. రైతులు కొత్త పంటలను విత్తడం ప్రారంభిస్తారు.

3. డిసెంబరు నెలతో ఆర్థిక సంవత్సరం ఎందుకు ముగియదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. వాస్తవానికి డిసెంబర్ నెలలో ముగింపుని ఉంచకపోవడానికి ఒక కారణం ఉంది. పండుగల కారణంగా చాలా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల డిసెంబర్‌తో ఆర్థిక సంవత్సరం ముగియకుండా మార్చితో ముగిసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

4. చివరి కారణం ఏమిటంటే ఏప్రిల్ 1 భారతదేశంలో హిందూ నూతన సంవత్సరం ప్రారంభమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. అందుకే ఇలా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు తమ పనికి సంబంధించిన విధానాలు కూడా మార్చుకుంటారు. ఆర్థిక సంవత్సరం నెలను మార్చి-ఏప్రిల్‌గా ఎందుకు నిర్ణయించారనే దాని గురించి రాజ్యాంగంలో ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి