WhatsApp: వాట్సప్ వాడేవారికి బ్యా‌డ్ న్యూస్.. ఛార్జీలు కడితేనే మెస్సేజ్‌లు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..

వాట్సప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. అక్టోబర్ 1వ తేదీ నుంచి బిజినెస్ మెస్సేజ్‌లకు ఛార్జీలు విధించనున్నట్లు మెటా ప్రకటించింది. ఇకపై సర్వీస్ మెస్సేజ్‌లకు కూడా ఛార్జీలు వసూలు చేయనుంది. టోకెన్ల పద్దతిలో ఈ ఛార్జీలు ఉంటాయని మెటా వెల్లడించింది. ఈ వివరాలు చూద్దాం.

WhatsApp: వాట్సప్ వాడేవారికి బ్యా‌డ్ న్యూస్.. ఛార్జీలు కడితేనే మెస్సేజ్‌లు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
Whatsapp Business

Updated on: Sep 30, 2026 | 4:05 PM

వాట్సప్ వ్యాపారులకు షాకిచ్చింది. వాట్సప్ బిజినెస్ మెస్సేజ్‌లకు ఇక నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు సాధారణ వినియోగదారుల తరహాలోనే బిజినెస్ మెస్సేజ్‌లు ఉచితంగా అందించనుండగా.. ఇక నుంచి ఉచిత సేవలు బంద్ కానున్నాయి. వ్యాపారుల నుంచి బిజినెస్ మెస్సేజ్‌లకు ఛార్జీలు వసూలు చేయాలని వాట్సప్ నిర్ణయం తీసుకుంది. ప్రతీ మెస్సేజ్‌కు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది వ్యాపారులను తీవ్ర ప్రభావితం చేయనుంది. యుటిలిటీ, అథెంటికేషన్ మెస్సేజ్‌ల తరహాలోనే సర్వీస్ మెస్సేజ్‌లకు కూడా అదే రేట్లను వసూలు చేయనుంది. ఈ రుసుంలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత సెప్టెంబర్ 30వ తేదీ నాటికి చెల్లింపు పద్దతిని నమోదు చేయని వ్యాపారులకు సర్వీస్ మెస్సేజ్‌లను డెలివరీ చేయడం నిలిపివేస్తామని ప్రకటించింది.

అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు..

అక్టోబర్ 1వ తేదీ నుంచి బిజినెస్ మెస్సేజ్‌లకు ఛార్జీలను విధించనున్నారు. సెప్టెంబర్ 30 నాటికి చెల్లింపు పద్దతిని నమోదు చేయని వ్యాపారులకు సర్వీస్ మెస్సేజ్‌లను డెలివరీ చేయడం నిలిపివేస్తామని మోటా హెచ్చరించింది. 24 గంటల సర్వీస్ విండోలో పంపిన కొన్ని రియాక్షన్లకు కూడా వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెటింగ్, యుటిలిటీ, అథెంటికేషన్ టెంప్లేట్ మెస్సేజ్‌ల కోసం మాత్రమే వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సర్వీస్ మెస్సేజ్‌లు నవంబర్ 1, 2024 నుంచి ఉచితంగా అందిస్తుండగా..24 గంటల కస్టమర్ సర్వీస్ విండోలో కస్టమర్లకు రిప్లై ఇచ్చేందుకు పంపే యుటిలిటీ మెస్సేజ్‌లు జులై 1,2025 నుంచి ఫ్రీగా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండూ కేటగిరీలకు కూడా ఛార్జీలు విధించనున్నారు. ప్రతీ మెస్సేజ‌కు కూడా ఛార్జీలు వసూలు చేయనున్నారు.

ఎంత ఛార్జీలు విధిస్తారు..?

ఆగస్టు 1 నుండి మెటా టోకెన్ల పద్ధతిలో ఛార్జీలు విధిస్తుంది. AI ప్రాసెసింగ్, సొంత డెలివరీ ఇది రెండింటినీ కవర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్త రేటు ప్రతి 1 మిలియన్ టోకెన్లకు $2గా నిర్ణయించారు. ఒక సాధారణ మెస్సేజ్ సుమారు 20,000 నుండి 25,000 టోకెన్లను ఉపయోగిస్తుంది. అంటే ఒక్కో మెస్సేజ్‌కు దాదాపు 4-5 సెంట్లు ఖర్చవుతుంది. మరింత సంక్లిష్టమైన ఇంటరాక్షన్‌లకు ఎక్కువ టోకెన్లు అవసరం కావచ్చు. అందువల్ల వాటికి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వ్యాపారులపై మరింత భారం పడనుందని చెప్పవచ్చు. దేశంలోని వ్యాపారులపై  ఇది తీవ్ర ప్రభావం చూపనుందని చెప్పవచ్చు. సామాన్యులకు దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వ్యాపారల అవసరాల కోసం వాట్సప్ వాడేవారికి మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us