Polestar O2: ప్రముఖ కార్ల దిగ్గజం ఓల్వో(Volvo Cars) సంస్థకు చెందిన సబ్ బ్రండ్ కంపెనీ పోలెస్టార్ తన సరికొత్త O2 EV వాహనాన వివరాలను బహిర్గతం చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు(Electric car) రోడ్‌స్టర్ కాన్సెప్ట్ హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. పోలెస్టార్ బాస్ థామస్ ఇంగెన్‌లాత్ మాట్లాడుతూ.. 2024 పోలెస్టార్ 5 నుంచి ప్రేరణ పొందిన O2 ఉత్పత్తికి ముందుకు రాకపోవడం బాధ్యతా రహితం అవుతుందని వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తు, వెడల్పాటి బాడీ, 2+2 క్యాబిన్ డిజైన్, కనిష్ఠ ఓవర్‌హాంగ్‌లతో పాటు పొడవైన వీల్‌బేస్‌తో.. ఆధునిక హంగులతో కారు క్లాసిక్ స్పోర్ట్స్ లుక్ లో ఆటో ప్రియులను ఆకర్షిస్తోంది. ఏరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించుకుంటూ.. గాలి ప్రవాహాన్ని నియంత్రించటం ద్వారా కారు అధిక మైలేజ్ ని అందించేలా రూపొందించింది కంపెనీ. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. కారు వెనుక లైట్లు ఎయిర్ బ్లేడ్‌లుగా పనిచేస్తాయి.
మతి పోగొడుతున్న కార్ ఫోటోలు..
పోలెస్టార్ O2లో డ్రైవింగ్ అనుభవం సజీవంగా, తేలికగా, పూర్తి విశ్వాసంతో ఉండేలా రూపొందించబడిందని సంస్థ చెబుతోంది. అత్యుత్తమమైన కార్ బాడీ నియంత్రణ, అధిక దృఢత్వం, సహజమైన డైనమిక్‌లు బెస్పోక్ బాండెడ్ అల్యూమినియం ప్లాట్‌ఫామ్ ప్రయోజనాలను.. పోలెస్టార్ 5 నుంచి స్వీకరించబడ్డాయి. ఇది UKలోని పోలెస్టార్ R&D బృందం అభివృద్ధి చేసింది.
ఇవీ చదవండి..
CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..
Fire Accident: కెమికల్ కంపెనీలో మంటలు.. రియాక్టర్లు ధ్వంసం.. కిలోమీటర్ల మేర పొగలు..
No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..