ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల పోటీ ప్రపంచం నెలకొంది. ఒకరికిమించి ఒకరు అన్నట్లు వివిధ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. బ్రాండ్‌లు వినియోగదారుల దృష్టిలో ఉంచుకుని నిరంతరం పోటీ పడుతున్నాయి. వివో వై300 ప్లస్, వన్‌ప్లస్ నోర్డ్ CE 4. రెండు ఫోన్‌లు రూ. 25,000లోపు లభిస్తాయి. ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్‌లలో స్టోరేజీ, ర్యామ్, కెమెరా, బ్యాటరీని హైలెట్ చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు.
దీని ధర రూ.23,999 ఉంది. రూ.1000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. 6.78-inch FHD+ AMOLED, 1080×2400 pixels, 120Hz, Water drop notch ఉంది. అలాగే Qualcomm Snapdragon 695, Octa-coreతో వస్తుంది. ఈ మొబైల్‌లో 8 ర్యామ్+128 స్టోరేజీతో వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 32MP. బ్యాటరీ 5000mAhతో 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 Funtouch OSతో వస్తుంది. డ్యూయల్ సిమ్ ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.24,000 (8GB+128), రూ.26,999 (8GB+256) ఉంది. మొబైల్ 6.7-inch Fluid AMOLED, 2412×1080 pixels, 120Hz, Aqua Touch వస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే Qualcomm Snapdragon 7 Gen 3, Octa-core. కెమెరా 50MP Sony LYT-600, (OIS), 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 16MP ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5500 mAh 100 వాట్ల Supervooc ఛార్జర్‌ను అందించింది. ఈ ఫోన్ కేవలం 29 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ OxygenOS 14పై రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇటీవల వన్‌ప్లస్ ఫోన్‌లలో గ్రీన్‌లైన్ సమస్య వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ సాఫ్ట్‌వేర్ సమస్య పెద్ద దుమారం రేపింది. దీంతో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ ఫోన్‌తో పాటు అన్ని ఫోన్‌ల డిస్‌ప్లేపై లైఫ్ టైమ్ వారంటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫోన్‌లే కాకుండా ఇది వరకు తీసుకున్న మొబైళ్లలో గ్రీన్ లైన్ గానీ, ఇతర డిస్‌ప్లే సమస్యలుంటే సర్వీస్ సెంటర్‌లో ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపింది.
Vivo Y300 Plus, OnePlus Nord CE 4 రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి. కానీ కీలకమైన తేడాలు ఉన్నాయి. OnePlus Nord CE 4 మరింత శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్, ఉన్నతమైన కెమెరా సిస్టమ్, మరింత అధునాతన సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది. Vivo Y300 Plus ఇప్పటికీ సామర్థ్యం గల డివైజ్‌గా ఉన్నప్పటికీ, కొంచెం తక్కువ ధరతో పోటీ ఇస్తోంది. చివరగా చెప్పాలంటే మీ బడ్జెట్, మీ మొబైల్‌ను వాడే తీరును బట్టి ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి