Money Making: మీ ప్లాట్‌ ఖాళీగా పడి ఉందా? అయితే అందులో ఇవి పెంచండి.. డబ్బులే డబ్బులు!

రియల్ ఎస్టేట్ కోసం కొనుగోలు చేసిన ఖాళీ భూములను సంవత్సరాల తరబడి నిరుపయోగంగా వదిలేయకుండా, తాత్కాలిక వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఔషధ మొక్కలు, పండ్లు, పూలు, కూరగాయలు వంటివి సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు.

Money Making: మీ ప్లాట్‌ ఖాళీగా పడి ఉందా? అయితే అందులో ఇవి పెంచండి.. డబ్బులే డబ్బులు!
Plots

Updated on: Mar 12, 2026 | 9:30 AM

రియల్‌ ఎస్టేట్‌ కోసం కొనుగోలు చేసిన భూములు చాలా ప్రాంతాల్లో సంవత్సరాల పాటు ఖాళీగా పడివుంటాయి. ఈ ఖాళీ స్థలాలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ స్థలం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక మొక్కలు, పంటలు సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. అలోవెరా, లెమన్‌గ్రాస్‌, తులసి, మింట్‌ వంటి ఔషధ మొక్కలు తక్కువ స్థలంలోనే సులభంగా పెరుగుతాయి. వీటికి నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. ఔషధ, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఈ మొక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. కేవలం కొన్ని నెలల్లోనే దిగుబడి రావడం రైతులకు లాభదాయకంగా మారుతుంది.

అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్‌, జామ, నిమ్మ వంటి పండ్ల మొక్కలు కూడా చిన్న స్థలాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌ వంటి పంటలకు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. ఒకసారి మొక్కలు నాటితే అనేక సంవత్సరాల పాటు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మరొక మంచి ఎంపిక పూల సాగు. మల్లె, చామంతి, గులాబీ వంటి పూల మొక్కలు చిన్న స్థలాల్లో కూడా సాగు చేయవచ్చు. పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో పూలకు అధిక డిమాండ్‌ ఉంటుంది. దీంతో రైతులు నిరంతర ఆదాయం పొందగలుగుతారు.

అలాగే ఖాళీ స్థలాల్లో కూరగాయల సాగు కూడా చేయవచ్చు. టమోటా, మిర్చి, బెండకాయ, పాలకూర వంటి కూరగాయలు తక్కువ కాలంలోనే దిగుబడి ఇస్తాయి. సమీప మార్కెట్లలోనే విక్రయించడంతో రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. వ్యవసాయ నిపుణుల మాటల్లో రియల్‌ ఎస్టేట్‌ భూములను ఖాళీగా వదిలేయకుండా తాత్కాలికంగా పంటల సాగుకు ఉపయోగిస్తే భూమి సంరక్షణతో పాటు ఆదాయం కూడా వస్తుంది. భూమి భవిష్యత్తులో నిర్మాణాలకు ఉపయోగపడే వరకు ఈ విధంగా సాగు చేయడం పెట్టుబడిదారులకు మంచి లాభాలు తీసుకురావచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us