Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర..

|

Oct 22, 2021 | 6:36 AM

Silver Price Today: తాజాగా బంగారం పరుగులు పెడుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర..
Follow us on

Silver Price Today: తాజాగా బంగారం పరుగులు పెడుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పండగ సీజన్‌లో పరుగులు పెడుతోంది. శుక్రవారం (అక్టోబర్‌ 22)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. గత రెండు, మూడు రోజులుగా పరిశీలిస్తే.. వెండి ధర దాదాపు రూ.3 వేల వరకు ఎగబాకింది. తాజాగా కిలో వెండిపై రూ.900 నుంచి రూ.1000 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.65,500 ఉండగా, చెన్నైలో రూ.70,200 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.65,500 ఉండగా, కోల్‌కతాలో రూ.65,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,500 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.70,200 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200 ఉండగా, విజయవాడలో రూ. 70,200 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!

BSNL: ఇకపై విమానాల్లోనూ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు: అనుమతులు దక్కించుకున్న బీఎస్‌ఎన్ఎల్‌