Gold Price Today: హమ్మయ్య.. బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు దూసుకుపోతుంటే గత నాలుగైదు రోజుల నుంచి వెనుకంజ వేస్తున్నాయి. స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఇక మే 5వ.

Gold Price Today: హమ్మయ్య.. బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
Gold Price

Updated on: May 05, 2024 | 6:28 AM

దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు దూసుకుపోతుంటే గత నాలుగైదు రోజుల నుంచి వెనుకంజ వేస్తున్నాయి. స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఇక మే 5వ తేదీన మాత్రం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బంగారం కొనుగోలుదారులుకు శుభవార్తేనని చెప్పాలి. ఎందుకంటే పరుగులు పెడుతున్న ధరలు కాస్త ఉపశమనం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 వద్ద ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,980 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
  • ఇక దేశంలో కిలో వెండి ధర రూ.83,000 ఉంది.

పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us