Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Gold Rate Today : దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట

Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
Gold Price
Follow us

|

Updated on: May 30, 2021 | 5:21 AM

Gold Rate Today : దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. అయితే ఆదివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 100 వరకు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,750కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,740 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 గా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల

Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా