Multibagger Stocks: ఏడాదిలో ధనవంతులను చేసిన 10 మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిని 6 రెట్లు పెంచేశాయి

|

Oct 18, 2021 | 11:49 AM

ఒక సంవత్సరంలో చాలా స్టాక్స్ పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించాయి. కొన్ని స్టాక్స్ 500 శాతానికి పైగా రాబడులను అందించి ధనవంతులుగా మర్చాశాయి.

Multibagger Stocks: ఏడాదిలో ధనవంతులను చేసిన 10 మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిని 6 రెట్లు పెంచేశాయి
Multibagger Stocks
Follow us on

Multibagger Stocks: గతేడాది కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్ గతేడాది చాలా వృద్ధిని సాధించింది. అయితే అన్నింటికన్నా ఎక్కువగా లాభాలను అందించిన 10 స్టాక్‌ల వివరాలను అందించాం. ఇవి పెట్టుబడిదారుల డబ్బును ఓ ఏడాదిలో 6 రెట్లు పెంచి, ధనవంతులుగా మార్చేశాయి. అయితే మల్టీ బ్యాగర్స్‌ను ఎంచుకోవడం చాలా కష్టం. మీకోసం గడేదాది కాలంలో అద్భుతంగా ఫలితాలు చూపించిన స్టాక్స్‌ను ఇక్కడ అందించాం.

అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas)
ఈ స్టాక్ సంవత్సరంలో 634 శాతం రాబడిని అందించింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .1452గా ఉంది.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy)
ఈ స్టాక్ ఏడాది కాలంలో 527 శాతం రాబడిని అందించింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .395 గా నమోదైంది.

అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (Adani Transmission Limited)
ఈ స్టాక్ సంవత్సరంలో 475 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .1687గా ఉంది.

బాలాజీ అమీన్స్ లిమిటెడ్ (Balaji Amines Limited)
ఈ స్టాక్ గతేడాది కాలంలో 431 శాతం రాబడిని అందించింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .4,70 గా నమోదైంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (Adani Enterprises Limited)
ఈ స్టాక్ గత ఏడాదిలో 397 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .135గా నమోదైంది.

ట్రైడెంట్ లిమిటెడ్ (Trident Limited)
గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 394 శాతం రిటర్న్ ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 45 గా నమోదైంది.

హెచ్‌ఎఫ్‌సీఎల్‌ (HFCL)
గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 347 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .95 గా నమోదైంది.

హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్(Happiest Minds Technologies)
గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 331 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ 1410 గా ఉంది.

గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్(Gujarat Fluorochemicals Limited)
ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 321 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 2080 గా నమోదైంది.

ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్(Indian Energy Exchange)
గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 307 శాతం రాబడిని ఇచ్చింది.
ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 793 గా ఉంది.

గమనిక: మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు నిపుణుడి సలహా తీసుకోవడం చాలా మంచింది. ఇక్కడ పేర్కొన్న సమాచారం మీకు అవగాహన కల్పించేందుకు అందించినదే తప్ప అందులో పెట్టుబడి పెట్టమని చెప్పలేం.

Also Read: Share Market: ఆరంభంలోనే దూకుడు.. ఆల్‌టైమ్ హైక్ దిశగా మార్కెట్లు..

Business Ideas: బిజినెస్ మొదలు పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ ఐడియా మీ కోసమే.. చిన్న పెట్టుబడితో లక్షలు సంపాధించండి..