Financial Planning: మహిళలను మహరాణులుగా మార్చే సూత్రం ఇది.. పాటించి చూడండి..

మహిళల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా సమాజం, దేశం కూడా బాగుపడుతుంది. మహిళలు ఉద్యోగం, వ్యాపారం చేయడం ద్వారా డబ్బులు సంపాదించడంతో పాటు మరికొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా సంపద పెరగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు కలుగకుండా ఉంటాయి. అలా వారిని శక్తివంతంగా మార్చే సూత్రాలు ఇవి..

Financial Planning: మహిళలను మహరాణులుగా మార్చే సూత్రం ఇది.. పాటించి చూడండి..
Women Empowerment

Updated on: Jul 14, 2024 | 2:57 PM

మహిళలు నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలలో మగవారికి పోటీగా ముందుకు సాగుతున్నారు. నేటి పరిస్థితులు, పెరుగుతున్నఖర్చులు, పిల్లల చదువులు, నగర జీవనం తదితర కారణాలతో ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికి అనుగుణంగానే మహిళలు ఆర్థిక అభ్యున్నతి వైపు అడుగులు వేస్తున్నారు.

అభివృద్ధి కోసం..

మహిళల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా సమాజం, దేశం కూడా బాగుపడుతుంది. మహిళలు ఉద్యోగం, వ్యాపారం చేయడం ద్వారా డబ్బులు సంపాదించడంతో పాటు మరికొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా సంపద పెరగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు కలుగకుండా ఉంటాయి. ముఖ్యంగా కింద తెలిపిన తొమ్మిది అంశాలు వారికి మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

ఆర్థిక విద్య.. ఆర్థిక అక్షరాస్యతను మహిళలు పెంచుకోవాలి. బడ్జెట్ ప్రణాళిక, పెట్టుబడి మార్గాలు, రుణాల నిర్వహణ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, వర్క్‌షాప్‌లను సందర్శించడం ద్వారా ఆర్థిక నైపుణ్యం పెరుగుతుంది.

కెరీర్ ప్లానింగ్.. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి తోడ్పడే మరో ముఖ్యమైన అంశం కెరీర్ ప్లానింగ్. మహిళలు తమ నైపుణ్యాలు, ఆసక్తికి అనుగుణంగా కెరీర్ అవకాశాలను ఎంపిక చేసుకోవాలి. జీతం, పదోన్నతులతో పాటు నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలి.

పొదుపు.. క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర సమయంలో అవసరాల కోసం పొదుపు చేయడం, అత్యవసర నిధిని సృష్టించడం, పదవీ విరమణ ప్రణాళిక వంటివి చాలా కీలకం. పొదుపును పెంచుకోవడం, అనవసర ఖర్చులను నివారించడం ద్వారా బలమైన ఆర్థిక పునాది వేసుకోవచ్చు.

పెట్టుబడి.. సంపద పెరగాలంటే వివిధ మార్గాలలో పెట్టుబడులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం.

మ్యూచువల్ ఫండ్స్.. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మీ రాబడిని పెంచుతాయి. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఆదాయాన్ని అందిస్తాయి. ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (ఎస్ఐపీలు) చాలా ఉపయోగంగా ఉంటాయి.

అన్వేషణ.. వ్యవస్థాపక వెంచర్లు, సైడ్ బిజినెస్‌లను అన్వేషించడం కూడా సంపద సృష్టికి దోహదపడుతుంది. దీనికోసం మహిళా వ్యాపారవేత్తలకు కొన్ని ప్లాట్‌ఫాంలు మద్దతు ఇస్తాయి. మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్, ఆర్థిక సహాయం చేస్తాయి.

రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం అనేది చాలా తెలివైన నిర్ణయం. భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉండడంతో లాభదాయకంగా ఉంటుంది.

బీమా రక్షణ.. ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరికీ భీమా అవసరం. ఊహించని పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు ఉపయోగపడతాయి.

ఆర్థిక స్వాతంత్య్రం.. ఆర్థిక స్వాతంత్య్రం అనేది మహిళల వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. లింగ సమానత్వం వైపు తీసుకువెళ్లే సాధనం కూడా. తెలివిగా పెట్టుబడి పెట్టడం, బీమా, ఆర్థిక ప్రణాళికలకు ద్వారా సురక్షిత ఆర్థిక భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..