ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. దాని ద్వారా కలిగే ఆర్థిక వెసులుబాటుతో పాటు రివార్డులు, క్యాష్ బ్యాక్ లు కూడా వీటి వినియోగం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో చెలామణీలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య రెండింతలైందని ఆర్థిక సంస్థలు నివేదిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 100 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎంత విస్తృతంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందో.. అంతే స్థాయిలో మోసాలు పెరుగుతున్నాయి. మరో వైపు క్రెడిట్ కార్డును ఎలా వాడాలో అర్థం చేసుకోలేని కొంత మంది వినియోగదారులు చేసే తప్పుల వల్ల కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే.. ఉపయోగపడే ఏకైక అస్త్రం క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్. ప్రతి నెలా ఆయా బ్యాంకులు వినియోగదారులకు ఈ స్టేట్ మెంట్ ను అందిస్తాయి. దీనిని సక్రమంగా చూసుకోవడం ద్వారా లోపాలను గుర్తించడంతో పాటు మోసాన్ని నిరోధించేందుకు మంచి ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రొఫైల్ ను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్లో చూసుకోవాల్సిన అంశాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనేది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు అందించే నెలవారీ సారాంశం. ఇది ఆ కార్డుపై నిర్దిష్ట బిల్లింగ్ వ్యవధిలో చేసిన అన్ని లావాదేవీలను వివరిస్తుంది. ఈ పత్రం ఆర్థిక నిర్వహణకు కీలకమైనది. ఎందుకంటే కార్డ్ హోల్డర్లు వారి ఖర్చు అలవాట్లను అర్థం చేసుకోవడం, చెల్లింపులను ట్రాక్ చేయడం, ఏవైనా వ్యత్యాసాలు లేదా అనధికార ఛార్జీలను గుర్తించడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..