ITR filing: మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు.. అందుకే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ను చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పులు లేకుండా ఐటీఆర్ సమర్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మీకు వచ్చే రీఫండ్‌లను సురక్షితంగా తెచ్చుకోవచ్చు. కానీ ఐటీఆర్ లో లోపాలు ఉంటే మాత్రం ఆలస్యం జరుగుతుంది. అలాగే జరిమానాలు విధించే అవకాశం ఉంది.

ITR filing: మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు.. అందుకే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Itr
Follow us

|

Updated on: May 27, 2024 | 2:23 PM

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారందరూ ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ చేయడం తప్పనిసరి. దీనిని ఒక వ్యక్తి ఆ ఏడాదిలో తన ఆదాయం, అలాగే చెల్లించాల్సిన పన్నుల సమాచారాన్ని తెలియజేస్తూ ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం అనవచ్చు. మీ జీతం, వ్యాపారంలో లాభం, ఇల్లు, ఆస్తి అమ్మకం. డివిడెంట్, మూలధన లాభాలు, ఇతరుల నుంచి పొందిన వడ్డీ తదతర వివరాలు ఉంటాయి. మీరు అదనంగా పన్ను చెల్లిస్తే, ఆదాయపు పన్ను శాఖ నుంచి డబ్బులు వాపసు వస్తాయి.

కచ్చితత్వంతో అనేక లాభాలు..

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ను చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పులు లేకుండా ఐటీఆర్ సమర్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మీకు వచ్చే రీఫండ్‌లను సురక్షితంగా తెచ్చుకోవచ్చు. కానీ ఐటీఆర్ లో లోపాలు ఉంటే మాత్రం ఆలస్యం జరుగుతుంది. అలాగే జరిమానాలు విధించే అవకాశం ఉంది.

జాగ్రత్తలు ఇవే..

ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు సాధారణంగా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వాటిని నివారించడానికి ఈ కింది తెలిపిన జాగ్రత్తలు పాటించాలి.

  • ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందే మీ ఆదాయం, మినహాయింపులు తదితర వాటికి సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.
  • ఆదాయం, పెట్టుబడులు, తగ్గింపులకు సంబంధించిన అన్ని పత్రాలు, రశీదులు, రుజువుల రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోండి. ధ్రువీకరణ, భవిష్యత్తులో ఏదైనా పన్ను పరిశీలన విషయంలో ఇవి అవసరం కావచ్చు.
  • వ్యక్తిగత సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. అంటే మీ పేరు, చిరునామా, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. వీటిలో ఏమైనా తేడాలు ఉంటే ఇబ్బందులు కలుగుతాయి.
  • జీతం, అద్దె ఆదాయం, పొదుపు నుంచి వచ్చే వడ్డీ, పెట్టుబడులు తదితర అన్ని ఆదాయ వనరులను కచ్చితంగా చేర్చండి. పొరపాటున వదిలేస్తే జరిమానాకు దారి తీస్తుంది.
  • తగ్గింపులు, మినహాయింపులను సరిగ్గా క్లెయిమ్ చేయండి. 80సీ, 80 డి తదితర వివిధ సెక్షన్ల క్రింద అర్హత కలిగిన తగ్గింపులపై మీకు స్పష్టత ఉండాలి. తగ్గింపుల విషయంలో తప్పుగా క్లెయిమ్‌ చేస్తే తిరస్కరణలు లేదా చట్టపరమైన సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది.
  • ఫారమ్ 26ఏఎస్ తో టీడీఎస్ వివరాలను చూసుకోండి. ఫారమ్ 16లోని టీడీఎస్ వివరాలతో ఫారం 26ఏఎస్ లోని వాటితో సరిపోయినట్టు ధ్రువీకరించుకోండి. వాటిలో ఏవైనా తేడాలు ఉంటే మీ పన్ను గణనలో వ్యత్యాసాలకు దారి తీస్తుంది.
  • మీ ఆదాయ వనరుల ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోండి. తప్పు ఫారం ఉపయోగించడం వలన మీ వాపసు చెల్లదు.
  • మీ రిటర్న్‌ను సమర్పించే ముందు దానిని పరిశీలించండి. ఏదైనా తప్పులు ఉన్నాయేమో చూసుకోండి.
  • అవసరమైతే ట్యాక్స్ ప్రొఫెషనల్ లేదా సీఏను సంప్రదించండి. ఆదాయపు పన్ను శాఖను సంప్రదించాల్సిన అవసరం ఉంటే సాయం కోరేందుకు వెనుకాడకండి.
  • పైనే తెలిపిన విధానాలను అనుసరించడం ద్వారా మీరు ఐటీఆర్ ను కచ్చితత్వంతో ఫైల్ చేయగలుగుతారు. అనవసరమైన జాప్యాలను, జరిమానాలను నివారించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!