Bike covers: మీ బైక్‌కి ఎండావానల నుంచి పూర్తి రక్షణ.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే..

ప్రధానంగా నగరాలలో నివసించే వారికి తమ బండిని ఇంట్లో పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండదు. తగినంత స్థలం లేకపోవడంతో దాదాపు రోడ్డు పక్కనే నిలిపి ఉంచుతారు. దీంతో ఎండ, వాన, దుమ్ము కారణంగా వాహనం రంగు పాడైపోవడంతో పాటు ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. వాటి పరిష్కరానికి బైక్ కవర్లు వాడడం చాలా అవసరం.

Bike covers: మీ బైక్‌కి ఎండావానల నుంచి పూర్తి రక్షణ.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే..
Bike Covers

Updated on: Jun 12, 2024 | 2:45 PM

దేశంలోని చాలామందికి తమ ద్విచక్ర వాహనంతో ఎంతో అనుబంధం ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు. లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత తొలి జీతంతో కొనుగోలు చేయవచ్చు. కారణం ఏదైనా మోటారు సైకిల్‌ను చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. నిత్యం శుభ్రపరచడం, సమయానికి సర్వీసింగ్ చేయించడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం తదితర వాటితో వాహనం పరుగులు పెడుతుంది. వీటితో పాటు ఆ వాహనానికి ఎండ, వాన నుంచి రక్షణ కల్పించడం కూడా చాలా అవసరం.

ఎంతో ప్రయోజనం..

ప్రధానంగా నగరాలలో నివసించే వారికి తమ బండిని ఇంట్లో పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండదు. తగినంత స్థలం లేకపోవడంతో దాదాపు రోడ్డు పక్కనే నిలిపి ఉంచుతారు. దీంతో ఎండ, వాన, దుమ్ము కారణంగా వాహనం రంగు పాడైపోవడంతో పాటు ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. వాటి పరిష్కరానికి బైక్ కవర్లు వాడడం చాలా అవసరం. మీ ద్విచక్ర వాహనాలను ధూళి, దుమ్ము, వర్షం నుంచి రక్షించే మంచి బైక్ కవర్లు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

సోలిమో యూనివర్సల్ బైక్ వాటర్ రెసిస్టెంట్ బైక్ కవర్..

అమెజాన్ సొంత బ్రాండ్ సోలిమో బైక్ కవర్ ముదురు నీలం, వెండి రంగులలో లభిస్తుంది. నీటిని లోపలకు వెళ్లనీయకపోవడంతో పాటు మన్నికగా, నాణ్యతగా ఉంటుంది. పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి అన్ని బైక్ లకూ చక్కగా సరిపోతుంది. యూవీ కిరణాల నుంచి కూడా బండికి పూర్తి రక్షణ లభిస్తుంది. 125 సీసీ బైక్‌లకు అనుకూలం ఉండే ఈ కవర్ ధర రూ.299 మాత్రమే.

ఆటోఫై వాటర్ ప్రూఫ్ బైక్ కవర్..

ఆటోఫై హండ్రెట్ పర్సంట్ వాటర్ ప్రూఫ్ టెస్టెడ్ బైక్ కవర్ మీ వాహనానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎండ, వాన, యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. బండి పెయింట్‌ పోతుందనే ఆందోళన మీకు ఉండదు. ఇది క్యారీ బ్యాగ్‌తో వస్తుంది కాబట్టి సులభంగా భద్రపర్చుకోవచ్చు. 180 సీసీ వరకూ అన్ని బైక్‌లకు చక్కగా సరిపోతుంది. దీని ధర రూ.498.

రైడర్‌షైన్ డస్ట్, వాటర్‌ప్రూఫ్ బైక్ బాడీ కవర్

క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350కి చక్కగా సరిపోతుంది. దీనికి డబుల్ మిర్రర్ పాకెట్‌ ఉండడంతో మీ బండి అద్దాలకు ఎటువంటి నష్టం జరగదు. బ్లాక్ కలర్ లో లభించే ఈ కవర్ మీ బండికి సూపర్ లుక్ తీసుకువస్తుంది. ప్రతికూలం వాతావరణంలో వాహనాన్నిప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, స్టాండర్డ్, థండర్‌బర్డ్ వాహనాలను బాగుంటుంది. దీని ధర రూ.499.

రైడా రైన్‌ప్రో బైక్ కవర్

అత్యుత్తమ ఆర్ఈ ఇంటర్ సెప్టర్ 650 బైక్ కవర్లలో రైడా రైన్‌ప్రో ఒకటి. నేవీ బ్ల్యూ రంగులో ఆకట్టుకుంటోంది. వర్షం, దుమ్ము, యూవీ కిరణాలతో పాటు ఇతర హానికరమైన అంశాల నుంచి బండిని రక్షిస్తుంది. భారీ వర్షంలో కూడా ఈ బండిలోకి చుక్క నీరు కూాడా చేరదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కు బాగా సరిపోతుంది. దీని ధర రూ.499

రాయల్ ఎన్ ఫీల్డ్ 1990643 బైక్ కవర్

అన్ని రాయల్ ఎన్ ఫీల్డ్ మోడళ్లకు సరిపోయేలా దీనిని తయారు చేశారు. వర్షం, దుమ్ము, ఎండ, యూవీ కిరణాల నుంచి వాహనానికి రక్షణ కల్పిస్తుంది. ఈ నేవీ రంగు కవర్ మీ బైక్‌కు మరింత అందాన్ని ఇస్తుంది. అలాగే మన్నిక చాలా బాగు టుంది. క్లాసిక్, బుల్లెట్, థండర్‌బర్డ్ కోసం కచ్చితంగా సరిపోతుంది. దీనిని యూకేలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ.1,078.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..