2024 Suzuki Avenis: స్పోర్టీ లుక్‌లో సరికొత్త సుజుకీ అవెనిస్.. అత్యాధునిక ఫీచర్లు.. అందుబాటు ధరలోనే..

సుజుకీ ఓ కొత్త స్కూటర్ ను మన దేశ మార్కెట్లోకి లాంచ్ చేసింది. 2024 సుజుకీ అవెనిస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 92,000(ఎక్స్ షోరూం)గా పేర్కొంది. ఇది దేశంలోని అన్ని సుజుకీ డీలర్ షిప్ నెటవర్క్ లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్కూటర్లో జెన్ జెడ్ ను టార్గెట్ చేస్తూ.. యువతను ఆకర్షించే విధంగా దీనిలో సరికొత్త ఫీచర్లు జోడించినట్లు సుజుకీ ప్రకటించింది.

2024 Suzuki Avenis: స్పోర్టీ లుక్‌లో సరికొత్త సుజుకీ అవెనిస్.. అత్యాధునిక ఫీచర్లు.. అందుబాటు ధరలోనే..
2024 Suzuki Avenis
Follow us

|

Updated on: Jul 25, 2024 | 3:49 PM

మన దేశంలో సుజుకీ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండే ఉంటుంది. వాటి డిజైన్, పనితీరు, ధర కూడా అందుబాటులో ఉండటంతో అందరూ ఈ కంపెనీ టూ వీలర్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో సుజుకీ ఓ కొత్త స్కూటర్ ను మన దేశ మార్కెట్లోకి లాంచ్ చేసింది. 2024 సుజుకీ అవెనిస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 92,000(ఎక్స్ షోరూం)గా పేర్కొంది. ఇది దేశంలోని అన్ని సుజుకీ డీలర్ షిప్ నెటవర్క్ లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్కూటర్లో జెన్ జెడ్ ను టార్గెట్ చేస్తూ.. యువతను ఆకర్షించే విధంగా దీనిలో సరికొత్త ఫీచర్లు జోడించినట్లు సుజుకీ ప్రకటించింది. ఈ 2024 సుజుకీ అవెనిస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2024 సుజుకీ అవెనిస్ ఇది..

ఈ కొత్త మోడల్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గ్లోసీ స్పార్కెల్ బ్లాక్/ పెరల్ విరా రెడ్, చాంపియన్ ఎల్లో నంబర్ 2/ గ్లోసీ స్పార్కెల్ బ్లాక్, గ్లోసీ స్పార్కెల్ బ్లాక్/ పెరల్ గ్లేసియర్ వైట్ కాంబినేషన్లలో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ లుక్ రావడానికి డిజైన్లో అదనంగా గ్రాఫిక్స్ జోడించడంత పాటు సైడ్లలో సుజుకీ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది.

2024 సుజుకీ అవెనిస్ ఇంజిన్ సామర్థ్యం..

ఈ కొత్త స్కూటర్లో 124.3 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.7హెచ్పీ, 10ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో స్పోర్టీ స్ల్పిట్ గ్రాబ్ రెయిల్స్, కొత్త ఫ్లోర్ బోర్డ్. ముందు వైపు యూఎస్బీతో కూడిన బాక్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సేఫ్టీ షట్టర్, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ క్యాప్. 21.8 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్ ఉంటుంది. ముందు వైపు డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, ఎల్ఈడీ టైల్ ల్యాంపు ఉంటుంది.

2024 సుజుకీ అవెనిస్ కనెక్టివిటీ ఫీచర్లు..

బ్లూటూత్ అనుసంధానమైన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఈ కొత్త స్కూటర్లో ఉంటుంది. సుజుకీ రైడ్ కనెక్ట్ యాప్ ఉంటుంది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్ లకు ఉపయోగపడుతుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ దీని ద్వారా సాధ్యమవుతుంది. ఈటీఏ అప్ డేట్లు, పీఓఐ ఇన్ఫర్మేషన్, కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెలు దీనిలో చూసుకునే వీలుంటుంది. సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంటర్ లాక్ వ్యవస్థ కూడా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్పోర్టీ లుక్‌లో సరికొత్త సుజుకీ అవెనిస్.. అత్యాధునిక ఫీచర్లు..
స్పోర్టీ లుక్‌లో సరికొత్త సుజుకీ అవెనిస్.. అత్యాధునిక ఫీచర్లు..
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
విద్యార్థి కంటతడితో కరిగిన పోలీసు మనసు.. హృదయం బరువెక్కేలా..
విద్యార్థి కంటతడితో కరిగిన పోలీసు మనసు.. హృదయం బరువెక్కేలా..
థియేటర్స్‌లో దెబ్బేసినా.. యూట్యూబ్‌లో దుమ్మురేపింది..
థియేటర్స్‌లో దెబ్బేసినా.. యూట్యూబ్‌లో దుమ్మురేపింది..
ఇంట్లో చొరబడి చిరుత హల్‌చల్.. ఆరు గంటల తర్వాత అడవిలోకి..
ఇంట్లో చొరబడి చిరుత హల్‌చల్.. ఆరు గంటల తర్వాత అడవిలోకి..
బడ్జెట్‌లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు
బడ్జెట్‌లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
అజిత్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ ఫెరారీ కారు..ఎన్ని కోట్లో తెలుసా?
అజిత్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ ఫెరారీ కారు..ఎన్ని కోట్లో తెలుసా?
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
5300 ఏళ్లుగా ఈ ఆలయం వెలుపల శివయ్య కోసం వేచి ఉన్న పార్వతి దేవి..
5300 ఏళ్లుగా ఈ ఆలయం వెలుపల శివయ్య కోసం వేచి ఉన్న పార్వతి దేవి..