ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోకు పోటీగా బూస్టర్‌ ప్లాన్స్‌

20 July 2024

TV9 Telugu

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటై భారతీ ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్లను ప్రారంభించింది. 

కొత్త 5జీ డేటా బూస్టర్ ప్లాన్

ఈ కొత్త డేటా బూస్టర్ల సాయంతో 1జీబీ, 1.5జీబీ రోజు వారీ డేటా ప్లాన్లు ఉన్న కస్టమర్లు కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. 

కొత్త డేటా బూస్టర్ల సాయంతో 

ఈ కొత్త డేటా బూస్టర్ల ప్యాక్‌లు రూ. 51, రూ. 101, రూ. 151కి అందుబాటులో ఉన్నాయి. ఈ పాక్ లు 3జీబీ, 6జీబీ, 9జీబీ డేటాను అందిస్తాయి. 

బూస్టర్ల ప్యాక్‌లు

ఇవి కేవలం డేటా బూస్టర్లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలి. దీని వ్యాలిడిటీ ఇప్పటికే వినియోగిస్తున్న 5జీ బేస్ ప్లాన్ ఆధారంగానే ఉంటుంది.

 5జీ బేస్ ప్లాన్

యూజర్లకు నిరంతరాయంగా ఇంటర్నెట్ ను వినియోగించేందుకు వీలుగా ఈ డేటా బూస్టర్ ప్యాక్ లను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఇంటర్నెట్

ఎయిర్ టెల్ రూ. 51 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతమున్న బేస్ ప్లాన్ కి 3జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది. రూ. 101 డేటా బూస్టర్ ప్యాక్‌తో బేస్ ప్లాన్ కి 6జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది. 

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ రూ. 151 డేటా బూస్టర్ ప్యాక్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న బేస్ ప్లాన్ కి 9జీబీ డేటా యాడ్ ఆన్ అవుతుంది.

బూస్టర్ ప్యాక్ 

వీటికి అదనంగా మరికొన్ని 5జీ డేటా ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. రూ. 249 నుంచి ఈ ప్లాన్లను ప్రారంభిస్తోంది. వీటిల్లో కొన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి రూ. 449 నుంచి ప్రారంభం 

అదనంగా