21 July 2024
TV9 Telugu
ఇప్పుడు పాన్ తీసుకోవడం మరింత సులభం. కేవలం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చు. ఇందుకు ఆధార్ ఉండటం తప్పనిసరి.
ఈ-పాన్ పొందాలంటే ముందుగా ఇలా చేయాలి. ముందుగా ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి.
ఆ తర్వాత ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి తక్షణ ఇ-పాన్ క్లిక్ చేయాలి. ఈ-పాన్ పేజీలో కొత్త ఈ-పాన్ పొందు క్లిక్ చేయాలి.
తర్వాత గెట్ న్యూ ఈ-పాన్ పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఐ ఎగ్రీ అనే చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించుపై క్లిక్ చేయాలి.
తర్వాత ఓటీపీ ధ్రువీకరణ పేజీలో చెక్ బ్యాక్స్ క్లిక్ చేసి ప్రోసీడ్ ఆప్షన్‌ను ఎంచుకోల్సి ఉంటుందని గుర్తించుకోండి.
ఓటీపీ ధ్రువీకరణ పేజీలో ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6 అంకెల ఓటీపీ నమోదు చేయాలి.
యూఐడీఏఐ ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి.
ఆధార్ వివరాల ధ్రువీకరణ పేజీలో ఐ యాక్సెప్ట్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేస్తే పది నిమిషాల్లో మీ పాన్ కార్డును మెయిల్ ద్వారా వస్తుంది.