SBI కస్టమర్లకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకు.. వర్కింగ్ టైమ్స్ మారాయి..ఆ సేవలు మాత్రమే అందుబాటులో..

State Bank Of India: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో అకౌంట్ ఉందా ? అయితే మీకు ఒక గమనిక.. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI కస్టమర్లకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకు.. వర్కింగ్ టైమ్స్ మారాయి..ఆ సేవలు మాత్రమే అందుబాటులో..
Sbi

Updated on: May 20, 2021 | 2:06 PM

State Bank Of India: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో అకౌంట్ ఉందా ? అయితే మీకు ఒక గమనిక.. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. బ్యాంకుకు సంబంధించిన విషయాలు.. ఖాతాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ కస్టమర్లకు తెలియజేస్తుంది. తాజాగా మరో విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూస్తునే ఉన్నాం. కోవిడ్ కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు పరుస్తున్నాయి. దీంతో బ్యాంక్ వర్కింగ్ టైమింగ్స్ కూడా మారిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్ర లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు తమ పని గంటలను కుదించుకున్నాయి.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బ్యాంక్ ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ మార్చేసింది. ఇక వర్కింగ్ టైంలో మాత్రమే పలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లుగా ప్రకటించింది.

ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్లు అత్యవసర పనులు ఉంటేనే తమ సమీప బ్యాంకు బ్రాంచుకు వెళ్ళాలని సూచించింది. ఇకపై ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పనిచేస్తాయి. మే 31 వరకు ఇదే విధంగా పనిచేస్తాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. అంతేకాకుండా.. బ్యాంకుకు వెళ్లేవారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఎంట్రీ ఉండదనే విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సమయంలో బ్యాంకులో క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ సంబంధిత పనులు, డీడీ, నెఫ్ట్, ఆర్టీజీస్ పనులు, గవర్నమెంట్ చలాన్ వంటి పనులు మాత్రమే చేస్తారు. ఇక అర్జెంట్ కానీ పనులు.. చిన్న చిన్న పనులు ఉంటే బ్యాంకుకు వెళ్ళకపోవడమే మంచిది.

Also Read: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

మహిళలను ఎక్కువగా బాధిస్తున్న వెన్నునొప్పి సమస్య.. తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

Loading...
Unable to load recommendations.
Follow Us