
చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే ఏదో ఒక మంచి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఏ బిజినెస్ చేయాలి? మంచి ఆదాయం ఎలా పొందాలనే విషయంలో వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి కోసమే ఈ బెస్ట్ బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ తినేందుకు యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ జంక్ ఫుడ్ హెల్త్‌కి అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా తినే వాళ్లు ఆ అలవాటును మానడం లేదు.
అయితే ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వారి ఆరోగ్యం చెడిపోకుండా, జంక్ ఫుడ్‌ను కాస్త మంచిగా ఇంటి వద్ద తయారు చేసినట్లయితే ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. మీరు ఇంటి వద్దనే జంక్ ఫుడ్ తయారు చేసి అమ్మితే, కలిగిన ఆహార పదార్థాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మీరు ఇంటి వద్ద ఉంటూనే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి పిజ్జా తయారీ మేకింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు మినీ పిజ్జా ఓవెన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇది ఎలక్ట్రిక్ ఆధారంగా పనిచేస్తుంది దీని ధర రూ.10,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఇతర ఖర్చులకు రూ.20 వేల వరకు అవుతుంది.
అనంతరం మీరు ఒక గదిని ఏర్పాటు చేసుకొని అందులో పిజ్జా తయారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆర్డర్ల కోసం స్విగ్గి, జొమాటో లో రిజిస్టర్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే దీనికోసం మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. FSAAI సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అనంతరం మీరు పిజ్జా బిజినెస్ ఇంటి వద్ద ఉండి ప్రారంభించవచ్చు. పిజ్జా తయారీలో అత్యంత ముఖ్యమైనది చీజ్, సాసెస్ అని చెప్పవచ్చు. వీటి కోసం మంచి క్వాలిటీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిజ్జా తయారీలో వాడే బేస్ ను మీరు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి