SIPలో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్క ఏడాది లేట్‌ అయితే ఏం జరుగుతుంది? మీరు ఎంత డబ్బు నష్టపోతారో తెలుసా?

పెట్టుబడులు ఆలస్యం చేయడం కోట్ల రూపాయల నష్టాలకు దారితీయవచ్చు. ఒక్క ఏడాది SIP ఆలస్యం కూడా భారీ ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించుకోవాలంటే త్వరగా పెట్టుబడులు ప్రారంభించడం ముఖ్యం. ఆలస్యంగా మొదలుపెడితే, అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

SIPలో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్క ఏడాది లేట్‌ అయితే ఏం జరుగుతుంది? మీరు ఎంత డబ్బు నష్టపోతారో తెలుసా?
Inflation Sip

Updated on: Dec 24, 2025 | 12:15 AM

ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత పెట్టుబడులు ప్రారంభించడం వల్ల పెద్దగా తేడా ఉండదని చాలా మంది అనుకుంటారు. ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత SIPలను ప్రారంభించినా ఏం కాదులే అని ఆలోచన మీకు ఉంటే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే.. పెట్టుబడి పెట్టడంలో ఒక సంవత్సరం ఆలస్యం కూడా భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టాలకు దారితీయవచ్చు. ఈ నష్టం వెంటనే మీకు కనిపించకపోవచ్చు. కానీ నిశ్శబ్దంగా జరుగుతుంది.

పెట్టుబడి పెట్టడంలో సమయం అత్యంత శక్తివంతమైన సాధనం. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అంత వేగంగా డబ్బు పెరుగుతుంది. దీనిని కాంపౌండింగ్ అంటారు. ఎవరైనా 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.20,000 పెట్టుబడి పెట్టి సగటున 12 శాతం రాబడిని పొందుతారని అనుకుందాం. 25 సంవత్సరాల తర్వాత వారికి దాదాపు రూ.3.40 కోట్లు ఉంటాయి. కానీ అదే వ్యక్తి ఒక సంవత్సరం ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించి 24 సంవత్సరాలు SIPని కొనసాగిస్తే, ఆ మొత్తం దాదాపు రూ.3 కోట్లకు తగ్గుతుంది. దీని అర్థం కేవలం ఒక సంవత్సరం ఆలస్యం వల్ల సుమారు రూ.50 లక్షల నష్టం జరుగుతుంది.

క్యాచ్-అప్ ట్రాప్

మీ పెట్టుబడిని ఆలస్యం చేయడం అంటే మీరు తరువాత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ లక్ష్యం 25 సంవత్సరాలలో రూ.2 కోట్లు సంపాదించడం అనుకుంటే.. మీరు ఈ రోజే SIP ప్రారంభిస్తే నెలకు దాదాపు రూ.13,000 పొదుపు చేస్తే సరిపోతుంది. అయితే మీరు పెట్టుబడిని ఒక సంవత్సరం ఆలస్యం చేస్తే అదే రూ.2 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు మీ SIPని నెలకు దాదాపు రూ.15,000కి పెంచుకోవాలి. మీ లేట్చేసింది తక్కువ టైమే అయినా.. అదే పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వీలైనంత త్వరగా సిప్ప్రారంభిస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి